ఆక్సిజన్ సరఫరాపై సీఎస్ రివ్యూ…

90
cs
- Advertisement -

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్.టి.సి అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి , తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు.

మన రాష్ట్రమునకు ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రవాణా లో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మేకానిక్ లు,ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించుటకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజుల కు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు.

కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించుటకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.
నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్.టి.సి. డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకొనుటకు ప్రైవేట్ కాంట్రాక్టర్ల తో చర్చించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, జి.ఏ,డి ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రిజ్వి, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శ్రీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమిషనర్ శ్రీ యం.ఆర్.యం.రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -