జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల అధికారులతో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ చర్యలను కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం చర్యలు తీసుకొని, శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, బారీకేడింగ్, మెడికల్ టీమ్స్, మాస్క్, శానిటైజేషన్ కు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో డిజిపి శ్రీ మహిందర్ రెడ్డి, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సెక్రటరీ టు గవర్నర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, డబ్ల్యూజీ సీడీఆర్ జమాల్ ఏ నాసిర్, గ్రూప్ క్యాప్టెన్, ఓసీ, కాలేజ్ ఆఫ్ ఏయిర్ వార్‌ఫేర్, హైదరాబాద్ బెటాలియన్స్, టిఎస్ఎస్ పి అడిషనల్ డిజిపి, అభిలాష్ బిష్త్, జాయింట్ సెక్రటరీ ప్రొటోకాల్ అర్విందర్ సింగ్, కల్నల్ భూపేంధర్ మరియు లాటినెంట్ కల్నల్ పవన్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.