ప్రజాపాలనా దినోత్సవం..సీఎం రేవంత్ జెండావిష్కరణ

16
- Advertisement -

ఈనెల 17 వతేదీన నిర్వహించే ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి  ఉదయం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రజా పాలనా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై డా. బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవమైన 17 వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

పబ్లిక్ గార్డెన్ లో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను సి.ఎస్. ఆదేశించారు. సభా స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితుల వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, పీఏ సిస్టం, భద్రతా తదితర ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. 17 న గణేష్ నిమజ్జనం ఉన్నందున ఈ సమావేశానికి హాజరయ్యే వారికి ట్రాఫిక్ నియంత్రణ, తగు మార్గాలను ముందస్తుగా తెలియచేయాలని నగర పోలీసు అధికారులకు సూచించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.

Also Read:కౌశిక్ రెడ్డిపై దాడి ప్రభుత్వ ప్రేరేపిత చర్యే!

- Advertisement -