పకడ్బందీగా ఎన్నికల కోడ్:శాంతి కుమారి

28
- Advertisement -

రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు సీఎస్ శాంతి కుమారి. సచివాలయంలో పోలీస్, ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవిన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఏవిధంగానైతే పనిచేసారో అదే స్పూర్తితో రానున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రంలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులుండగా, 9 అంతర్రాష్ట్ర చెక్-పోస్ట్ లున్నాయని అన్నారు. ఇప్పటివరకు పోలీస్ శాఖ ద్వారా పదికోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మద్యం అక్రమ రావాణా కు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీన పరుచుకున్నామని చెప్పారు. హైదరాబాద్ లోని పోలీస్ శాఖకు చెందిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి కూడా మద్యం రవాణాపై సి.సి టీవీ ల ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు.

Also Read:ఉన్మాదం సృష్టిస్తోన్న బీజేపీ:షర్మిల

- Advertisement -