BJP:అందుకే బీజేపీలో కల్లోలం!

44
- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఆ పార్టీని ఎన్నికల ముందు అంతర్గత విభేదాలు చుట్టుముట్టాయి. ఇటీవల చాలమంది కీలక నేతలు,. విజయశాంతి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వంటి వారు పార్టీ వీడిన సంగతి విధితమే. అయితే ఈ పార్టీలో అనిశ్చితి ఏర్పడడానికి కారణం ఏమిటనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాతే పార్టీలో ముసలం ఏర్పడిందనేది కొందరి చెబుతుంటే.. కాదు కాదు బీసీలలో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించిన తరువాతే అసలు సమస్య మొదలైందని మరికొందరు చెబుతున్నారు. తాజాగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటపై పెదవి విప్పారు.

బీసీని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించాకే.. విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి వంటివారు పార్టీ విదారని అమిత్ షా వ్యాఖ్యానించడం కొత్త చర్చలకు దారి తీస్తోంది. దీన్ని బట్టి బీసీనేతను సి‌ఎం అభ్యర్థిగా ఎన్నూకోవడం ఆ పార్టీలోని మెజారిటీ నేతలకు ఇష్టం లేదనే సంగతి బయటపడుతోంది. ప్రస్తుతం బీజేపీ సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. ముఖ్యంగా పార్టీలోని చాలమంది సీనియర్ నేతలను పక్కన పెట్టేలా ఈటెల రాజేందర్ వంటి వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంతర్గత విభేదాలకు అసలు కారణమనేది మరికొందరు చెబుతున్న మాట.

ఇకపోతే ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ ఇద్దరికి కూడా గత కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. వీరిద్దరిలో ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకి మరింత తిప్పలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీలోని అంతర్గత విభేదాలకు చాలా సమస్యలే కారణంగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి ఈ సమస్యల నుంచి బయట పడేందుకు అధిస్థానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Also Read:Bigg Boss 7: ఈ వారం నో ఎలిమినేషన్‌

- Advertisement -