సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు సీపీ అవినాష్ మహంతి. ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. త్వరలో ఈ కేసు వివరాలను అందిస్తామని చెప్పారు.
గతేడాది 4,850 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 5,342 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 2022లో 93 హత్య కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 105 కేసులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
సిఫారసు లేఖలపై పోస్టింగ్‌లు ఉండబోవు అని…ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీపీ సూచించారు. అనుమతి లేకుండా న్యూఇయర్ వేడుకలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read:కిడ్నీలో రాళ్ళు పోవాలంటే..!