ఏడుగురు సఫారి క్రికెటర్లకు కరోనా..!

238
south africa
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి విస్తరిస్తుండగా కరోనా నేపథ్యంలో అన్నిరకాల టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక వివిధ దేశాల్లో లాక్ డౌన్ సడలింపులతో క్రికెట్ టోర్నమెంట్‌లపై ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి.

ఖాళీ స్టేడియాల్లోనైనా టోర్నమెంట్‌లు నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు వివిధ దేశాల ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్‌ఏ)కు షాకింగ్ లాంటి వార్త బయటపడింది.

ఆటగాళ్లతో పాటు పలువురు కాంట్రాక్ట్ ప్లేయర్స్ కలిపి మొత్తం 100 మందికి కరోనా పరీక్షలను నిర్వహించింది. అయితే అందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది అని బోర్డు సీఈఓ జాక్వెస్ ఫాల్ తెలిపారు. దీంతో దక్షిణాఫ్రికా బోర్డు జూన్ 27 న స్థానికంగా ప్రారంభించాలనుకున్న టోర్నమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసింది.

- Advertisement -