కెప్టెన్స్‌ డేలో సెల్పీ టైమ్‌

145
- Advertisement -

పొట్టి కప్‌కు అంతా రెఢీ అయ్యిన వేళ కెప్టెన్ల్‌ ఓకే చోట సేల్ఫీ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022వ టీ20వరల్డ్‌ కప్‌ సర్వం సిద్దమైంది. ఆటోర్నీలో సూపర్‌12స్టేజ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబరు 22నుంచి ప్రారంభంకానున్నవేళ 16జట్లకు చెందిన కెప్టెన్లతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కెప్టెన్స్‌ డే పేరుతో జరిగిన ఈవెంట్‌లో ఆ కెప్టెన్లు అంతా మీడియాతో మాట్లాడారు.

16 జట్లకు చెందిన కెప్టెన్లు దిగిన ఫోటోను ఐసీసీ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ తీసిన సెల్ఫీ ఫోటోను కడా ఐసీసీ ట్వీట్‌ చేసింది.

దాయాదుల మధ్య సమరం అక్టోబర్‌23న పోటీపడనున్నాయి. నవంబర్‌ 13వ తేదీన ఫైనల్‌ జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన జట్టు 1.6 మిలియన్ల డాలర్లు సొంతం చేసుకుంటుంది.

ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలు తమ మ్యాచ్‌లను సూపర్‌ 12 స్టేజ్‌ నుంచి ప్రారంభించనున్నాయి. ఫస్ట్‌ రౌండ్‌లో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్‌, స్కాట్‌లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.

- Advertisement -