దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపశమన చర్యలు ప్రకటించింది ఆర్బీఐ. 3 నెలల పాటు అన్ని టర్మ్ లోన్లపై మారిటోరియం విధించిన ఆర్బీఐ…దీని ప్రభావం క్రెడిట్ స్కోరుపై ఉండదని స్పష్టం చేసింది.
క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని స్పష్టం చేసింది. ఆయా చెల్లింపులను నిబంధనల ప్రకారం వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని తెలిపింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది.
గృహ, వ్యక్తిగత, వాహన, విద్యా తదితర రుణాలు మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈఎంఐలన్నింటిని ఆటోమేటిక్‌గా మూడు నెలల తర్వాత నుంచి కట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాయా లేక ఒక్కో వినియోగదారుడికి వేర్వేవేరుగా చెల్లించేందుకు అనుమతినిస్తాయా అనేది తర్వాత వెల్లడించనున్నారు.