‘ఆర్ఆర్ఆర్’ రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్

324
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగా అభిమానుల‌కు మంచి గిప్ట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇవాళ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీలో చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ప్రొమో ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్.అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. మూడింటిలోనూ ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

విడుదలైన రెండు నిమిషాల వ్యవధిలోనే తెలుగు వర్షన్ వ్యూస్ లక్ష దాటింది. ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్లో ఉంది. ఈమూవీలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌గా..ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కాగా ఇటివ‌లే ఈమూవీ టైటిల్ ను ఖ‌రారు చేశారు. ‘రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ను ఫైన‌ల్ చేశారు. డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈమూవీ 2021జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది.

- Advertisement -