‘భ‌గ‌వంత్ కేస‌రి’ పై క్రేజీ రూమర్లు

50
- Advertisement -

బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. భారీ అంచ‌నాలున్న ఈ సినిమాలో మొత్తం నాలుగు పాట‌లున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నాలుగు పాటల్లో ముందుగా రెండు పాట‌ల‌ను రిలీజ్ చేసి, మూడో పాట‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. నాలుగో పాట డైరెక్ట్‌గా సినిమాలోనే రిలీజ్ చేసేట్లు మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట. ఫ‌స్ట్ సింగిల్ మాత్రం ఈ నెల 31 లేదా 1న రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఇక ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై కూడా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే..

ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ ఫ్లాష్ బ్యాక్ వస్తోందట. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని అనిల్ రావిపూడి చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించాడ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి బాల‌య్య సినిమాల్లో ఫ్లాష్‌ బ్యాక్ అంటే చాలా ప‌వ‌ర్‌ ఫుల్‌ గా ఉంటుంది, కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈసారి దాన్ని ఫ‌న్నీగా మ‌లిచాడ‌ని.. పైగా ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమాలో ఈ ఫన్నీ ఫ్లాష్ బ్యాకే మెయిన్ హైలైట్ గా ఉంటుంద‌ని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య ఓల్డ్ ఏజ్ పాత్రలోనే నటిస్తున్నాడు. పైగా యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది.

అలాగే అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పైగా బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Also Read:ఉస్తాద్‌లో మరో హీరోయిన్‌!

- Advertisement -