ఊర మాస్ టైటిల్‌తో ‘ఉస్తాద్’ ఇస్మార్ట్ శంకర్‌..!

101
ram

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. కొత్త సినిమాకు ఉస్తాద్ అనే పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం.

ఇందులో రామ్‌ను సరదాగా అంతా ‘ఉస్తాద్’ అనే పిలుస్తుంటారు. అందుకే, అదే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు.