కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి..

315
sunnam rajaiah
- Advertisement -

సీపీఎం నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(59) ఇకలేరు. కరోనాతో ఇవాళ ఉదయం మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కరోనా పాజిటివ్ రాగా విజయవాడ ఆస్పత్రికి తరలించగా అక్కడే కన్నుమూశారు. రాజయ్య మృతితో సీపీఎం శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగిపోయాయి.

సీపీఎం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజయ్య. రాష్ట్ర విభజన అనంతరం రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా సాధార‌ణ‌మైన జీవితాన్ని గ‌డిపారు. అసెంబ్లీకి ఆటోలో, బ‌స్సులో వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే. ఇవాళ ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -