కాంగ్రెస్ తో ఢీ.. కామ్రేడ్ల దెబ్బ!

46
- Advertisement -

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీల మద్య పొత్తు అంశం దోబూచులాడుతున్న సంగతి తెలిసిందే. వామపక్షాలను కలుపుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని హస్తం పార్టీ తెగ ప్రయత్నిస్తూ వస్తోంది. అయితే సీట్ల కేటాయింపులో మాత్రం అసలు సమస్య ఏర్పడింది. వామపక్షలను గుప్పిట్లో ఉంచుకొని ఆధిపత్యం చెలాయించాలని చూసిన హస్తం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలుగా ఊహించని రీతిలో షాక్ ఇస్తూ వచ్చాయి. మొదట ఐదు సీట్లు, పది సీట్లు, పదిహేను సీట్లు.. ఇలా సీట్ల సంఖ్యను పెంచుకుంటే తాము అడిగిన సీట్లు కేటాయించాల్సిందేనని వామపక్షాలు డిమాండ్ చేస్తుండడంతో హస్తం పార్టీకి మైండ్ బ్లాక్ అయింది .

దీంతో కమ్యూనిస్ట్ పార్టీలతో తెగతెంపులు చేసుకోవాలా లేదా ఆగిగిన సీట్లు కేటాయించాలా అనే కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించే సీట్ల విషయాన్ని మాత్రం హోల్డ్ లో ఉంచింది. పొత్తు విషయమై కమ్యూనిస్టు పరిట్ నేతలు పలుమార్లు కాంగ్రెస్ నేతలతో సమావేశం అయినప్పటికి వారి నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ అనూహ్యంగా సిపిఎం పార్టీ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు ప్రకటించి 14 స్థానాల్లో అభ్యర్థులను కన్ఫర్మ్ చేసి కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా 7 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ..మొత్తానికి మిత్రా పక్షంగా ఉంటాయని భావించిన వామపక్షాలు చివరి నిముషంలో షాక్ ఇవ్వడంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది.

Also Read:విజువల్ ట్రీట్‌లా షారుఖ్..డంకీ!

- Advertisement -