ఐపీఎల్‌ కంటే ముందే సీపీఎల్‌…. షెడ్యూల్ రిలీజ్

159
cpl t20
- Advertisement -

టీ20 ప్రపంచకప్ రద్దు కావడంతో ఐపీఎల్‌తో పాటు పలు టోర్నీలకు లైన్ క్లీయర్ అయింది. ఇప్పటికే ఈ సెప్టెంబర్‌లో ఐపీఎల్ జరిపేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుండగా తాజాగా వెస్టిండీస్ టీ20 లీగ్‌ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. కరోనా తర్వాత జరిగే తొలి టోర్నీ ఇదే.

కరోనా వైరస్ నేపథ్యంలో ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీజన్ జరుగనుంది.ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 33 మ్యాచ్​లు జరుగనున్నాయి.

తొలిమ్యాచ్‌ ట్రిన్​బాగో నైట్ రైడర్స్​, గుయానా ఆమెజాన్ వారియర్స్ మధ్య జరుగనుంది. ట్రినిడాడ్​లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీలో 23 మ్యాచ్​లు, సెమీ ఫైనల్స్​, ఫైనల్ సహా మొత్తం 10మ్యాచ్​లు క్వీన్ పార్క్స్​ ఓవల్​లో జరుగనున్నాయి.

- Advertisement -