పవన్ తీరు బాధాకరం:సీపీఐ నారాయణ

25
- Advertisement -

జనసేన అధినేత పవన్‌..ఎన్డీఏతో కలవడంపై స్పందించారు సీపీఐ నారాయణ. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..మతవాద పార్టీ అయినటువంటి బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి ప్రమాదకరమన్నారు.

చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం బాధాకరంగా ఉందని… గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని సూచించారు.

Also Read:రేవంత్‌రెడ్డి ఓ దుష్టుడు..దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ

తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంటె డిపార్ట్ మెంట్ సంస్థలతో దాడులు చేయించడం వంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి పవన్ మద్దతివ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

Also Read:ఢిల్లీని వణికిస్తున్న డెంగీ..

- Advertisement -