CPI Narayana:రేవంత్ అరెస్ట్‌కు కుట్ర

11
- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన నారాయణ…రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలన్నదే బీజేపీ లక్ష్యమని, ఆయనను అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారని.. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం అన్నారు. లంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాలేదు.. రుణమాఫీపై పొలిటికల్ డ్రామా నడుస్తోందని, ఎవరూ రాజీనామా చేయరని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తమ మిత్ర పక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు సీపీఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే మోడీ పతనం ప్రారంభమైనట్లే. ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలను అరెస్టు చేసి జైలుకు పంపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారన్న సాకుతో కేసుల్లో ఇరికించడం సరికాదు అని దుయ్యబట్టారు నారాయణ.

Also Read:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

- Advertisement -