కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ (LDF) లో కీలక చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా కేరళలో కొత్త ముఖాలు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాజ్యసభ ఎంపీ పి. సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు.
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూటమిని లేదా ప్రతిపక్షాన్ని నడిపించడానికి కొత్త నాయకులు రావాలని సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పినరయి విజయన్ స్థానంలో ప్రత్యామ్నాయ నాయకత్వంపై ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై కొంత ప్రజా వ్యతిరేకత సహజమని, అయితే దానిని అధిగమించడంలో ప్రస్తుత నాయకత్వం కొంత ఇబ్బంది పడిందని ఆయన సూచించారు.
కేరళలో పినరయి విజయన్ శకం ముగిసిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయంలో ఎవరూ శాశ్వతం కాదని, కాలానికి అనుగుణంగా మార్పులు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్డీఎఫ్ కూటమి మళ్ళీ పుంజుకోవాలంటే ప్రజలకు కొత్త ఆశలు కల్పించే నాయకత్వం అవసరమని, అప్పుడే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోగలమని ఆయన చెప్పారు.
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో సీపీఎం తర్వాత అత్యంత బలమైన పార్టీ సీపీఐ. అటువంటి పార్టీకి చెందిన ఎంపీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్పు గురించి బహిరంగంగా మాట్లాడటం కేరళ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. ఇది భవిష్యత్తులో సీపీఎం-సీపీఐ మధ్య చర్చలకు దారితీసే అవకాశం ఉంది.
Also Read:షారుఖ్-దీపికా ‘కింగ్’..షూటింగ్ లీక్!

