దేశాన్ని దోచుకుతినే వాళ్లకు మోదీ నాయకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను ద్వేషించే పని తప్ప ప్రజల కోసం మంచి చేయాలని ఏనాడు అనుకోవడం లేదని ఆరోపించారు. ఖమ్మంలో కూనంనేని మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు యత్నం చేసే మోదీ ప్రజలకు నీతులు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నేతలను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారం రెండు సంవత్సరాలు క్రితమే ప్రారంభమయితే ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్మకానికి పెట్టారని నిలదీశారు. ఎరువుల కర్మాగారం అమ్మరని గ్యారంటీ లేదని అన్నారు.ప్రైయివేటీకరణకు రూ. 6 లక్షల కోట్లు కేటాయించడం మోదీ ఫాసీజాన్ని తెలియజేస్తుందని ఆరోపించారు.
కమ్యూనిస్టులను తిట్టడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం వందశాతం పెరిగిందని అన్నారు.గోదావరి పరివాహక ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు తవ్వాలని డిమాండ్ చేశారు. అరబిందో కంపెనీ కోయగూడెం ఓసీని దక్కించుకున్నారని, ఇది తప్పు అయితే తనను ఉరి తీయాలని లేదా మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒరిస్సా లో చంద్ర గుప్తా మైన్ ను రాజా గోపాల్ రెడ్డి కి అప్పగించి సింగరేణి ప్రైవేటీకరణకు అడుగులు వేయడం కాదాని ప్రశ్నించారు. శ్రావణి పల్లి కల్యాణ్ ఖని, మందమర్రి మైన్ లను ప్రైవేటు పరంచేయనున్నారని ఆరోపించారు. మోదీ ని ఎదుర్కొనడానికి ఎవరినైనా కలుపుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..