- Advertisement -
హైదరాబాద్ నగరంలో ఇంధనం మరియు ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో ఎలాంటి ఇంధన సంక్షోభం లేదని ఆయన స్పష్టం చేశారు.
నగరవాసులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అవసరం లేకుండా పెట్రోల్ బంకులు లేదా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెట్టొద్దని సీపీ సూచించారు. తప్పుడు వార్తల కారణంగా అనవసర గందరగోళం సృష్టించకూడదని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇంధన సంక్షోభంపై అసత్య ప్రచారాలు చేయకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి సమస్యలు లేవని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -

