ఇకపై నిరంతరం పోలీసుల పెట్రోలింగ్: సీపీ సజ్జనార్

381
sajjanar
- Advertisement -

శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు హైవే పెట్రోలింగ్ వాహనాల గస్తీ నిరంతరం ఉంటుందన్నారు సీపీ సజ్జనార్. నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలను సజ్జనార్ ప్రారంబించారు..ఈ వాహనాలతో 24 గంటల గస్తీ ఉంటుందన్నారు.

ఒక్కో వాహనానికి 15 కిలోమీటర్ల బాధ్యత ఇస్తున్నామని…. హైవేపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఒక్కో పెట్రోలిగ్ వాహనంలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్స్ ఉంటారని చెప్పారు. త్వరలోనే బాలానగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మొత్తం 55 కిలోమీటర్ల వరకు పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు తిరుగుతాయని…ప్రమాదాలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా డయల్ 100కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -