బ్రేకప్‌పై స్పందించిన నయన్‌ లవర్ విగ్నేష్..!

520
vignesh
- Advertisement -

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే తన లవ్‌కు మరోసారి బ్రేకప్ చెప్పారని వార్తలు పుకార్లు షికార్ చేస్తున్నాయి. నయన్- విగ్నేష్ విడిపోయారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలపై స్పందించారు విగ్నేష్.

తాను,నయన్ ఇంకా కలిసే ఉన్నాం అని అర్థమయ్యేలా ఓ ఫొటోను షేర్ చేసి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. నానుమ్ రౌడీ దాన్(నేనూ రౌడీనే)సినిమాతో నయన్‌తో కలిసి లవ్‌లో పడ్డాడు విగ్నేష్.

తర్వాత పలు సందర్బాల్లో ఇద్దరు కలిసి తమ ప్రేమ విషయం అందరికి తెలిసేలా బహిరంగంగానే ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే విగ్నేశ్‌ కంటే ముందు శింబు,ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపారు. తర్వాత వారికి బ్రేకప్ చెప్పి విగ్నేష్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది నయన్‌.

nayan

- Advertisement -