ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డ్రగ్ రాకెట్ పై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. మీడియాతో మాట్లాడిన సీపీ…అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ను చేధించాం…డ్రగ్స్ వ్యాపారీ నైజీయన్ మార్క్ ఓవోలబీ ముఠాను అరెస్ట్ చేశాం అన్నారు.
మత్తుకు బానిసలైన యువతకు ప్రమాదకర మాదక ద్రవ్యాలకు సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న ఎల్.బి.నగర్ ఎస్.ఓ.టి పోలీసులు. ఇందులో ఒక నైజీరియన్ దేశస్తుడు ఒలాబే కాగా అతనికి సహకరించిన ముగ్గురు స్థానిక యువకులను నేరెడ్మెట్ పోలీసుల సహాయంతో ఎల్.బి.నగర్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 38 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యం కొకైన్ ను తో పాటు 22 వేల రూపాయల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.
వీటి విలువ మొత్తం 9 లక్షల 10 వేల రూపాయలు ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలియజేశారు. ఈ సంద్భంగా ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీస్ సిబ్బందిని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ అభినందించారు.