బహిరంగప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటుపై నిషేధం…

246
cp anjanikumar
- Advertisement -

కరోనా నేపథ్యంలో ఈ సారి బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేష్ విగ్ర‌హాల ఏర్పాటుపై నిషేధం విధించారు సైబరాబాద్ పోలీసులు. గణపతి పూజ ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు సీపీ అంజనీ కుమార్.

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేష్ మంట‌పాల‌ను ఏర్పాటు చేయ‌టం, సాముహికంగా ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. మొహ‌రం కూడా ఇంట్లోనే నిర్వ‌హించుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్‌లో గ‌ణేష్ ఉత్స‌వాలు ఎంత ఘ‌నంగా జ‌రుగుతాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌ణేష్ ఉత్స‌వాలు, అంగ‌రంగ‌వైభంగా న‌వ‌రాత్రులు,నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం దేనిక‌వే ప్ర‌త్యేకం. కానీ ఈసారి కరోనా వైర‌స్ ప‌రిస్థితుల్లో పండగలు జరుపుకునే పరిస్ధితిలేదు.

- Advertisement -