కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు..

7
- Advertisement -

దేశంలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7లను భారత్ లో (తమిళనాడు, గుజరాత్) గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియం(INSACOG) డేటా వెల్లడించింది.

ఈ వేరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం సింగపూర్ లో ఎక్కువగా ఉండగా తాజాగా దేశంలో వెలుగుచూడటం విశేషం. జ్వరం, ముక్కు కారడం, గొంతు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా నెలల తర్వాత ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 23 కొత్త కరోనా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో ఒకటి నిర్ధారించబడ్డాయి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి పాజిటివ్ గా వచ్చింది. కేరళలో ఒక్క మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

Also Read:ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -