మళ్ళీ కరోనా భూతం..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

30
- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ కరోనా కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ జేఎన్-1’ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఈ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇది సాధారణ కరోనా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరూ మళ్ళీ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. .

ఇక మన దేశంలో ఈ ‘జేఎన్-1’ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే 1700 వందలకు పైగా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూచనలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కరోనా లక్షణాలే ఇందులో కూడా కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. నిరంతరం దగ్గు, జ్వరం, అలసట, తీవ్రమైన జలుబు, అతిసారం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. ఇక వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* బయటకు వెళ్ళేటప్పుడు జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ దరించాలి.
* దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు లేదా టవల్ ముక్కు లేదా నోటికి అడ్డు పెట్టుకోవాలి.
* జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
* గర్భిణీలు, పిల్లలు, వృద్దులు చలివాతావరణంలో ఎక్కువసేపు ఉండరాదు.
* బయట నుంచి వచ్చినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఏవైనా వస్తువులను ముట్టుకున్నప్పుడు శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలి.

Also Read:తమన్నాకి ఇది చివరి అవకాశమే

- Advertisement -