కొవిడ్‌ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

15
- Advertisement -

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ముఖ్యంగా చైనాలో కొత్త వేరియంట్ బీభత్సం సృష్టిస్తుండగా అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇక దేశంలో ఇవాళ అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. మహమ్మారి కారణంగా కేసులు భారీగా పెరిగితే ఎదుర్కొనేందుకు సంసిద్ధతను పరీక్షించేందుకు ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించనున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సఫ్దర్‌జంగ్‌లో ఆసుపత్రిలో పాల్గొననుండగా.. కలెక్టర్లు అవసరమైన మందులు, ప్రాణాలను రక్షించే పరికరాలు, బెడ్ కెపాసిటీ, అంబులెన్స్ సేవల లభ్యతపై పర్యవేక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -