- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఐదు నెలల తర్వాత గత 24 గంటల్లో దేశంలో గరిష్ట స్ధాయికి కోవిడ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 1890 కరోనా కేసులు నమోదుకాగా 7గురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్‌లో ఇద్దరు, కేరళలో ముగ్గురు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4.98 శాతంగా ఉండగా దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.56 శాతం,వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.02శాతంగా, రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది.
ఇప్పటివరకు మొత్తం 4,47,04,147 కోవిడ్ కేసులు నమోదుకాగా 4,41,63,883 మంది కరోనా నుండి కోలుకున్నారుఉ. దేశంలో మరణాల శాతం 1.19 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -