Corona:విజృంభిస్తున్న కొత్త వేరియంట్

31
- Advertisement -

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 761 కొత్త కేసులు నమోదుకాగా ప్రస్తుతం దేశంలో 4,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,78,885కి చేరగా నిన్న ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి.

కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,33,385కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 541కి పెరిగాయని వైద్య శాఖ తెలిపింది.

Also Read:చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా..జాగ్రత్త!

- Advertisement -