దేశంలో కరునా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మార్చి 31 నుండి దేశంలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి.
కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అంటూ వినిపించే కాలర్ ట్యూన్లతో ప్రజలు విసిగెత్తిపోయారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రీ-కాల్ సందేశాలను తొలగించేందుకు పరిశీలన చూస్తోంది.
ఈ సందేశాలను నిలిపివేయాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది ఆర్టీఐ ద్వారా అనేక ఫిర్యాదులను జోడించి ఈ కాలర్ ట్యూన్ తొలగించాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది.