కరోనా మహమ్మారిపై ప్రపంచదేశాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి నుండి బయటపడేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచదేశాలు పోటీపడుతున్నాయి. చాలా దేశాలు క్లినికల్ దశలో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తుండగా భారత్‌కు చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేశాయి.
పూణే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫార్మా కంపెనీ లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నది. క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
కోతులపై ప్రయోగాలు సక్సెస్ కావడం.. మనుషులపై ప్రయోగాలు ప్రారంభదశలో ఉన్నాయని .. మనుషులపై సక్సెస్ అవగానే ఉత్పత్తి ప్రారంభించి సెప్టెంబర్ నాటికి 6 కోట్ల డోసులు రిలీజ్ చేస్తామని వెల్లడించింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ ను కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తామని ఆ కంపెనీ తెలిపింది. మొత్తంగా సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.