రాష్ట్రంలో మొదటి రోజు వాక్సినేషన్ విజయవంతం..

51
Covid 19 vaccination

తెలంగాణ రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటి రోజు విజయవంతమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటి రోజు మొత్తం 4296 మందికి ఇవ్వాళ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా… అందులో 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 140 సెంటర్స్‌లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా హైదరాబాద్ లో 417మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాక్సిన్ తీసుకున్నారు.అతి తక్కువ లబ్ధిదారులున్న జిల్లా జగిత్యాల.. 60 మంది లబ్ధిదారులు ఉండగా 38మంది వాక్సిన్ తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.