- Advertisement -
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగానే కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ 3వేల పైనే కేసులు నమోదవుతుండడంతో రాష్ర్టంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,093 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,01,174కు చేరింది.
ఇవాళ 20 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు 4,638మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 2,623 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,72,763 మంది రికవర్ అయ్యారని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది.
- Advertisement -