రాష్ట్రపతి ఎస్టేట్ లో కరోనా కలకలంపై రాష్ట్రపతి భవన్ అధికారులు స్పష్టతనిచ్చారు. 13వ తేదీన ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో మరణించిన కరోనా బాధితుడు రాష్ట్రపతి భవన్ సిబ్బంది కానీ, రాష్ట్రపతి ఎస్టేట్ నివాసి కాదు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రపతి భవన్ సిబ్బంది కుటుంబ సభ్యుడితో మరణించిన వ్యక్తి కాంటాక్ట్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ సిబ్బందితో సహా ఆయన ఏడుగురు కుటుంబ సభ్యులను 16వతేదీన క్వారన్ టైన్ సెంటర్ కు తరలించారు.
కాంటాక్ట్ ఉన్న రాష్ట్రపతి భవన్ సిబ్బంది కుటుంబ సభ్యుడికి పరీక్షల అనంతరం పాజిటివ్ తేలగా మిగతవారికి నెగటివ్ వచ్చింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రపతి భవన్ ఎస్టేట్ లోని సిబ్బంది నివాస ప్రాంతాల్లోని కుటుంబాలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నిర్బంధంలో ఉన్న వారికి నిత్యావసరాలు వారి నివాసాలకే సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.