కోర్ట్..ఓటీటీ డేట్ ఫిక్స్

2
- Advertisement -

వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఇక తాజాగా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 11 , 2025 నుండి కోర్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇతర భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్స్ ను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 57 కోట్లు వసూలు చేసి పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది.

Also Read:కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

- Advertisement -