వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 15న విడుదలైన కోర్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. విడుదలైన ప్రతీ చోటా మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా ఈనెల 11నుంచి కోర్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
ప్రేమికుల కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.56.50 కోట్లు వసూల్ చేసింది. అటు ఓవర్సీస్లోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం.
Also Read:అలెర్ట్..ఎండల తీవ్రత అధికమే!