కిచ్చా సుదీప్‌కు షాక్‌..

346
sudeep karnataka
- Advertisement -

కన్నడ స్టార్ హీరో,కిచ్చ సుదీప్‌కు చిక్‌ మంగళూరు కోర్టు షాకిచ్చింది. కాఫీ ఎస్టేట్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఈ కేసులో ఎన్నిసార్లు చెప్పినా, కోర్టుకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా సుదీప్ హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 22లోగా సుదీప్‌ జాడ తెలుసుకొని కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.

సుదీప్‌కు చెందిన కిచ్చా క్రియేషన్స్‌ 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్‌ కోసం పటేల్ ఎస్టేట్‌ను అద్దెకు తీసుకొన్నారు. అద్దెగా రూ.కోటి 80 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదురింది. అయితే అడ్వాన్స్‌ కింద రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగితా డబ్బును చెల్లించలేదని బాధితుడు పటేల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అంతేగాదు తన ఎస్టేట్‌లో ఉన్న కాఫీ తోటల్ని, ఆస్తిని ధ్వంసం చేశారని ఆరోపించారు.

దీంతో కేసు న్యాయస్ధానం పరిధిలోకి వెళ్లగా సుదీప్‌ ఇప్పటివరకు విచరాణకు హాజరు కాలేదు. దీంతో సుదీప్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సుదీప్‌పై అరెస్ట్ వారెంట్ శాండల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సుదీప్ ఈగ,బాహుబలి,రక్త చరిత్ర వంటి తెలుగు సినిమాల్లో నటించారు.

- Advertisement -