కపుల్ ఫ్రెండ్లీ..వసూళ్ల జోరు!

4
- Advertisement -

వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ . చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మనసా వరణాసి జంటగా నటించగా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. హృద్యమైన కథ, సహజమైన నటనతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మూడు రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.42 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీతో ‘మండే టెస్ట్’ను విజయవంతంగా దాటిందని సమాచారం.

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగి బాబు, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు పి సహకారంతో ఈ చిత్రం నిర్మించబడింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు.

Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

- Advertisement -