- Advertisement -
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్యించబోయే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాం నిర్మాణానికి సంబంధించిన జీవో విడుదలైంది. ఈ సందర్భంగా నేడు విగ్రహ నమూనా చిత్రపటాన్ని ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహ నమూనా చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు.
రాష్ర్ట ప్రభుత్వం రూ. 146.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్‌టీఆర్ గార్డెన్ పక్కన 11.8 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టును చేపట్టింది. 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు. 7.91 లక్షల కిలోల స్టీల్, 96.19 టన్నులతో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు. ప్రాజెక్టులో మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు.
- Advertisement -