PSLV C-60:నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 60

2
- Advertisement -

శ్రీహరికోట నుండి మరో రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 9 గంటల 58 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. నిన్న రాత్రి 8 గంటల 58 నిమిషాల నుంచి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది.

ఈ రాకెట్‌ ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలు ఛేజర్, టార్గెట్ ను నింగిలోకి పంపనున్నారు. PSLV సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటివరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక PSLV కోర్‌ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమిది.

పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ బరువు 320 టన్నులు కాగా.. ప్రస్తుతం ప్రయోగిస్తున్న రాకెట్‌కు స్టాపాన్ బూస్టర్లను తొలగించడంతో.. అది 229 టన్నుల బరువు కలిగి ఉంటోంది. దీని ద్వారా సుమారు 440 కిలోల బరువున్న ఛేజర్, టార్గెట్‌ అని పిలవబడే ఉపగ్రహాలను.. రోదసీలో ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్‌-4లో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన డాకింగ్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.

Also Read:బ‌డుగుల‌ గ‌ళం పీజేఆర్‌: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -