- Advertisement -
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన గెలుపుకు విశేష కృషి చేసిన KPHB 114వ డివిజన్ ఇంచార్జ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని హైదరాబాద్ లోని తన నివాసంలో 114వ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మంత్రికి శాలువా కప్పు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు అనంతరం గజమాలతో మంత్రిని సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కూకట్ పల్లి KPHB 114వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన మందాడి శ్రీనివాసరావుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
- Advertisement -