మంత్రి ఎర్రబెల్లిని కలిసిన మీర్‌పేట కార్పొరేటర్ ప్రభుదాస్..

218
errabelli
- Advertisement -

మీర్ పేట డివిజన్‌ అభివృద్ధికి తనవంతు సాయాన్ని అందిస్తానని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. GHMC ఎన్నికల్లో 4వ మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్ లో TRS అభ్యర్థి గా గెలిచిన జెర్రిపోతుల ప్రభుదాస్, TRS పార్టీ డివిజన్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు, ghmc ఎన్నికల్లో ఆ డివిజన్ ఇంచార్జీ గా ఉన్న, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి ని, వరంగల్ – హన్మకొండ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

తనను గెలిపించినందుకు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ అభివృధ్ధి కి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాసు ని సన్మానించి అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తాను ఇచ్చిన మాట ప్రకారం డివిజన్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. గెలిపించినందుకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అన్నారు. డివిజన్ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డివిజన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు చేస్తానన్నారు. డివిజన్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుపేద మహిళలకు స్త్రీ నిధి లోన్లు కలిపిస్తమన్నారు. ఈ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండారపు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -