కరోనా వైరస్‌కు ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. స్ధానికంగా ఓ మీడియాతో మాట్లాడిన ట్రంప్..కరోనా వ్యాక్సిన్ తయారీపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయని … వ్యాక్సిన్ డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు.
జనవరి 23వ తేదీన తనకు తొలిసారి నోవెల్ కరోనా వైరస్ గురించి అధికారులు తెలిపారని…దేశ ఆర్ధికవ్యవస్థ వీలైనంత త్వరగా గాడిలో పడేవిధంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్కూళ్లను, యూనివర్సిటీలను సెప్టెంబర్‌లో తెరవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు ట్రంప్ చెప్పారు.
ఇక చైనాలోని వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుండే కరోనా వైరస్ వ్యాపించిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చూస్తూ చైనాపై విమర్శలు గుప్పించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో. అయితే చైనా అధికారులు దీనిని ఖండిస్తున్నారు.