- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండగా థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరించింది. పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలు జారీ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే మంచిదని వెల్లడించింది. వ్యాధి తీవ్రత బట్టి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్ ఇవ్వాలని పేర్కొంది. వైరస్ లక్షణాలు తక్కువగా ఉంటే యాంటీ మైక్రోబయల్స్ మందులు ఉపయోగించకూడదని… చిన్న చిన్న లక్షణాలతో పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదని తెలిపింది.
- Advertisement -