ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దాదాపు 4 వేల మందిని పొట్టన బెట్టుకుంది. కాగా ఇండియాలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 43కు పెరిగింది. వీటిలో 40 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేరళలో ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 52 కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్ల జాబితాను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. వీటిలో మూడు సెంటర్లు ఏపీలో, తెలంగాణలో ఒకటి ఉన్నాయి. తెలంగాణలో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఏర్పాటు చేయగా… ఆంధ్రప్రదేశ్‌లో 1) శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2) ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్టణం. 3) గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం లో ఏర్పాటు చేశారు.