దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు రికార్డు స్ధాయిలో 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా మరణాలసంఖ్య కూడా పెరగడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పంజా విసురుతోంది.
ఇక కరోనా సెకండ్ వేవ్‌లో ఈ మహమ్మారి వైరస్ కొత్త రూపం దాల్చింది. దీంతో సెకండ్ వేవ్ సమయంలో ట్రీట్మెంట్ సమయం కూడా పెరుగుతున్నట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. మొదటి వేవ్ సమయంలో స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ లో వారం రోజులు ఉంటె సరిపోయేదని, లక్షణాలు ఎక్కువగా ఉంటె నాలుగు నుంచి వారం రోజులపాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు.
సెకండ్ వేవ్ లో వైరస్ ఉత్పరివర్తనాల కారణంగా వైరస్ బలం పుంజుకుందని,ఫలితంగా ట్రీట్మెంట్ తీసుకునే సమయం పెరిగిందని కనీసం 15 రోజులపాటు ట్రీట్మెంట్ అందించాల్సి వస్తోందని నిపుణులు చెప్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక కనీసం వారం రోజులపాటు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. కరోనా తగ్గిన రెండు వారాల పాటు దగ్గు,నీరసంగా ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు.