జాగ్రత్తలు తీసుకుంటూ-ఉత్పత్తులు సాధిస్తున్న సింగరేణి ఉద్యోగులు

1695
sccl
- Advertisement -

కరోనా విస్తరిస్తున్న నేప థ్యంలో అన్ని రకాల పరిశ్రమలు మూతపడినా సింగరేణి సంస్డ మాత్రం అత్యవసర సేవల విభాగంగా గుర్తించబడటంతో కార్మికులు, అధికారులు నిత్యం 3 షిప్టులల లో విధులకు హాజరవుతు బొగ్గు నుఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకంటే బొగ్గు ఉత్పత్తి నిలిచి పోతే కరెంటు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో అన్ని ధర్మల్ విద్యుత్ సంస్డ లు ప్రధానం గా సింగరేణి బొగ్గు నే ఇంధనం గా వాడి విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీరుస్తున్నాయి .

కొన్ని కార్మిక సంఘాలు కొన్ని పార్టీల వారు సింగరేణి గనులను బందు పెట్టాలని కోరినాసరే నేటి విపత్కర పరిస్ధితులలో విద్యుత్ అనేది అత్యవసరం కనుక గనుల్లో యధాతంగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు.

దేశంలోని బొగ్గు గనులన్నీ కూడా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అజమాయిషీలో వారిచ్చే ఆదేశాలను అనుసరించి పని చెయ్యల్సి ఉంటుంది ముఖ్య0గా ఇటువంటి అత్యవసర పరిస్డితులలో దేశం మొత్తం ఒకే విధానం అమలు చెయ్యాల్సిన పరిస్డితులు ఉంటాయి.

అయితే అన్ని గనులలో పని ప్రదేశాలలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలను సింగరేణి యాజమాన్యం , కార్మికులు తీసుకుంటూ ప్రతీ నిమిషం అప్రమత్తతో పని చేస్తున్నారు.

కరోనా వ్యాధిని నివారించడానికి డాక్టర్లు, పోలీసులు , విద్యుత్ పారిశుద్య సిబ్బంది మొదలగు అత్యవసర సేవ కులు మాదిరిగానే సింగరేణి ఉద్యోగులు కూడా ఇటువంటి విపత్కరl పరిస్థితుల్లో రాష్ట్ర అవసరాల కోసం బొగ్గు ఉత్పతి మరియు విద్యుత్తు ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనడం గమనార్హం.కోల్ ఇండియా అనుబంధ కంపెనీలు కూడా ఇదే విధంగా గా పని చేస్తున్నాయి.వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కంపెనీ 27 వ తేదీన తన చరిత్ర లోనే అధికంగా 4లక్షల 29 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది.

- Advertisement -