కరోనా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

448
Coronavirus
- Advertisement -

ప్రపంచ దేశాలతో పాటు, ఇండియాను కూడా ‘కరోనా’ వైరస్‌ వణికిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, ప్రైవేటు సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. తప్పనిసరి అయితే తప్ప రద్దీ ప్రదేశాల్లో తిరగవద్దని సూచనలు చేశాయి.

ప్రస్తుతం ఈ కరోనా వైరస్‌కు మందు లేదు. ఈ వ్యాధి రాకుండా నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. క్రమంతప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని చేతులతో టచ్ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కరోనా అనుమానితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక దగ్గు, జ్వరం లాంటివి వస్తే.. బయట తిరగడం మానేయాలి. ఎక్కువ నీరు తాగుతూ.. రెండు రోజుల పాటు గమనించాలి. అప్పటికీ జ్వరం, దగ్గు తగ్గకపోతే.. ఎవర్నీ దగ్గరకు రానీయకుండా.. వైద్యుడిని సంప్రదించాలి.

- Advertisement -