ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు కరోనా 213 దేశాలకు విస్తరించగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరాయి. ఈ మహమ్మారితో 3,82,227 మంది చనిపోగా 30,09,732 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అమెరికాలో అత్యధికంగా 1,08,059 మంది కరోనాతో చనిపోయారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 18,81,205కు చేరింది.
ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. గత 24 గంటల్లో 8,171 పాజిటివ్ కేసులు నమోదుకాగా 2,00,321 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 24న నమోదుకాగా లక్ష మార్కును చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. ఇక రెండు లక్షలకు చేరుకోవడానికి కేవలం 14 రోజులు మాత్రమే పట్టింది. మే 19 నుండి జూన్ 2 నాటికి మరో లక్ష కేసులు నమోదయ్యాయి.