కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. చైనాలో మృతుల సంఖ్య 722కు చేరుకోగా బాధితుల సంఖ్య 34,546కు చేరింది. కరోనా వైరస్ పుట్టిన ప్రాంతమైన హుబేయ్ ప్రావిన్సులో అత్యధిక స్థాయి మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి.
చైనాకు ఆవల 27 దేశాల్లో దాదాపు 260 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. కరోనా ముప్పును ఎదుర్కోవడానికి 675 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4807 కోట్లు) కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచదేశాలకు తెలిపింది. చైనా నుంచి తరలించిన 645 మంది భారతీయులకూ వైద్యపరీక్షలు చేయించగా.. కరోనా నెగెటివ్ వచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వుహాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేటప్పుడు పాక్ విద్యార్థులనూ తెచ్చేందుకు సిద్ధమని పాక్‌కు తెలిపినట్లు విదేశాంగమంత్రి జైశంకర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
కరోనాపై చైనా ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్ మృతిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన మృతిపై విచారణ జరిపేందుకు చైనా ప్రభుత్వం వుహాన్‌కు దర్యాప్తు బృందాన్ని పంపింది.